NTV Telugu Site icon

Tillu Square: టిల్లు స్క్వేర్‌కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?

Tillu Square

Tillu Square

Tillu Square US Premiers Cancelled in last Minute: ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన మీడియా షో క్యాన్సిల్ చేసిన నిర్మాత నాగ వంశీ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ సినీ మార్కెట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అదేమిటంటే టిల్లు స్క్వేర్ సినిమాకి ముందస్తుగా ఎలాంటి ప్రీమియర్స్ అమెరికాలో కూడా వేయడం లేదని అంటున్నారు. సాధారణంగా కొంచెం హైప్ ఉన్న అన్ని తెలుగు సినిమాలకి అమెరికాలో ప్రీమియర్స్ ముందుగానే పడతాయి. కానీ ఈ సినిమాకి ముందుగా ప్రీమియర్ కోసం అమ్మిన టికెట్లు క్యాన్సిల్ చేశారు. ఆ క్యాన్సిల్ చేసిన డబ్బులు రిఫండ్ చేస్తున్నట్లు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మెసేజ్ లు వెళ్లినట్లు తెలుస్తోంది. చాలా లేటుగా రాత్రి 9:30 సమయానికి ఈ సినిమా ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి.

Samantha: సైలెంట్‌ గా ముంబైకి షిప్ట్‌ అవుతున్న సమంత.. అందుకే వారికి నో?

అయితే ఇలా లేటుగా చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ప్రీమియర్స్ వేస్తారని అంటున్నారు. యూఎస్ మార్కెట్ లేని రొటీన్ మాస్, మసాలా సినిమాలకు మాత్రమే ఈ విధమైన స్ట్రాటజీ ఫాలో అవుతారని తెలుస్తోంది. అయితే అమెరికా తెలుగు సినిమా హిస్టరీలో మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియర్ టికెట్లు మూడు వారాల ముందే అమ్మేసి ఇప్పుడు క్యాన్సిల్ చేయడం మొదటిసారి జరుగుతుందని అంటున్నారు. ఇలాంటి సినిమాకి అమెరికా నుంచి వచ్చే రివ్యూలు అక్కడి నుంచి వచ్చే సోషల్ మీడియా టాక్ కి భయపడి ఇలా చివరి నిమిషంలో టికెట్లు క్యాన్సిల్ చేయడం అంటే కచ్చితంగా ప్రేక్షకులకు నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని మల్లిక్ రామ్ డైరెక్టర్ చేశాడు. నాగ వంశీ, సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నిర్మించారు.

Show comments