Tillu Square Director Mallik Ram Web Series with Sundeep Kishan: ఒకప్పుడు ఓటీటీ అంటే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత అక్కడ మిస్ అయిన వాళ్లు చూడటానికి మాత్రమే అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలో క్వాలిటీ కంటెంట్ తో పాటు ఒరిజినల్ కంటెంట్ తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొంతమంది హీరోలు సైతం ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమవుతున్న ఘటనలు ఇప్పటికే చూశాం. వెంకటేష్ రానా కలిసి చేసిన రానా నాయుడు మంచి హిట్ అయింది. అలాగే మరి కొంతమంది హీరోలు కూడా కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఇప్పుడు ఒక యంగ్ హీరో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఆయన ఎవరో కాదు, ఈ మధ్యనే ఊరి పేరు భైరవకోన అనే సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్.
O Bhama Ayyo Rama: సుహాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ‘నువ్వు నేను’ అనిత..!
తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు మల్లిక్ రాం దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక ఓటీటీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కాబోయే నెట్ ఫిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఒకటి వీరిద్దరి కాంబినేషన్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఒక్కటి అడక్కు సినిమా నిర్మాత రాజీవ్ చిలుక ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఈ వెబ్ సిరీస్ లాంచ్ చేసే అవకాశం కల్పిస్తోంది. గతంలో సందీప్ కిషన్ నిర్మాతగా ఒక వెబ్ మూవీ చేశాడు. ఇప్పుడు హీరోగా ఒక వెబ్ సిరీస్ చేయబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. దర్శకుడు మల్లిక్ రాం నరుడా డోనరుడా అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత అద్భుతం అనే సినిమా చేయడంతో పాటు ఇటీవలే వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాని డైరెక్ట్ చేశాడు. మొదటి రెండు సినిమాలు ఓ మాదిరి టాక్ తెచ్చుకునా టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడం ఆయనకు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.