NTV Telugu Site icon

Tiger Vs Pathan: ప్రీప్రొడక్షన్ స్టార్ట్… మార్చ్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ రెగ్యులర్ షూటింగ్…

Tiger Vs Pathan

Tiger Vs Pathan

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి, ఇండియన్ సూపర్ స్టార్స్ తో వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి 2023 జనవరిలో సల్మాన్ షారుఖ్ ని ఒకే సినిమాలో చూపించి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన యాష్ రాజ్ ఫిల్మ్స్… ఈసారి అంతకు మించి అనేలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వర్కౌట్ చేస్తున్నారు. పఠాన్ లో లాగా షారుఖ్ అండ్ సల్మాన్ కాకుండా ఏకంగా షారుఖ్ Vs సల్మాన్ ఖాన్ కి రంగం సిద్ధమయ్యింది. షారుఖ్ ‘పఠాన్’గా, సల్మాన్ ‘టైగర్’గా వార్ అంటే ఇండియన్ స్క్రీన్ తగలబడిపోవడం గ్యారెంటీ. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’గా క్యామియో ప్లే చేస్తున్నాడు. 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ లోనే నెక్స్ట్ షారుఖ్ vs సల్మాన్ సినిమాకి ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేసేలా ఉంటుందట. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కూడా చేసేసారు.

షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ మధ్య బ్రిడ్జ్ పైన ఒక భారీ బైక్ ఛేజ్ ఎపిసోడ్ అండ్ ఫైట్ సీన్ ని షూట్ చేసారు. టైగర్ 3 కాన్ఫ్లిక్ట్ నుంచి “టైగర్ vs పఠాన్” కథ పడుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ నవంబర్ నుంచి ఈ ఎపిక్ క్లాష్ కి సంబంధించిన మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వనుంది. వచ్చే ఏడాది మార్చ్ నుంచి ‘టైగర్ vs పఠాన్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ భారీ బడ్జట్ హై ప్రొఫైల్ కాస్టింగ్ మూవీ నెక్స్ట్ ఇయర్ దీపావళి సీజన్ ని కానీ 2025 జనవరి 25న కానీ రిలీజ్ కానుంది. ఆ రోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర పుడుతుంది.

Show comments