Site icon NTV Telugu

Tiger Shroff: అన్నా నువ్వు అసలు నేలపై నిలబడే సినిమాలు చేయవా? టీజర్ అంతా గాల్లోనే ఉన్నావ్?

Tiger Shroff

Tiger Shroff

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. గణపత్ సినిమా పార్ట్ 1ని అక్టోబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. పాన్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్… గణపథ్ తెలుగు టీజర్ ని మెగాస్టార్ చిరంజీవితో లాంచ్ చేయించారు. టైగర్ ష్రాఫ్ సినిమాలు అనగానే కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. గణపథ్ సినిమా కూడా అందుకు తక్కువేమి కాదన్నట్లు టీజర్ తోనే చూపించారు మేకర్స్. 1:45 నిమిషాల నిడివితో కట్ చేసిన టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో టైగర్ గాల్లోనే ఉన్నాడు. టీజర్ ఓపెనింగ్, ఎండ్ తప్ప టైగర్ నేలపైకి దిగి విలన్స్ కి కొట్టిన ఫ్రేమ్ ఒక్కటి కూడా లేదు.

2070లో టీజర్ ని ఓపెన్ చేసిన ఫ్యూచర్ లో తినడానికి తిండి కూడా లేకుండా కొట్టుకునే మనుషులు ఉండడం చూపిస్తూ గణపథ్ ఫ్యూచరిస్టిక్ డ్రామా జానర్ లో తెరకెక్కుతున్న సినిమానేమో అనిపించేలా చేసారు. అంతలోనే ఫ్యూచర్ అయినా పీరియాడిక్ డ్రామా అయినా టైగర్ ఫైట్ చేయాల్సిందే అంటూ టీజర్ యాక్షన్ మోడ్ తీసుకుంది. టీజర్ లో అమితాబ్ కొత్తగా కనిపించాడు, హీరోయిన్ కృతి సనన్ అందంగా కనిపిస్తూనే ఫైట్స్ కూడా చేస్తుంది. ఓవరాల్ గా గణపథ్ టీజర్ ని చూస్తే సినిమా కేవలం యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే అనిపించడం గ్యారెంటీ. అయితే దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని మల్టీలాంగ్వేజస్ లో రిలీజ్ అవుతున్నవే. ఇప్పుడు గణపత్ సినిమా దసరాకి రిలీజ్ అవుతుండడం మన సినిమాలని ఓపెనింగ్ రోజున కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. అదే ఒకవేళ గణపత్ హిట్ అయితే మాత్రం లియో, టైగర్ నాగేశ్వర రావు, ఘోస్ట్ సినిమాలకి నార్త్ లో కష్టాలు తప్పవు.

Exit mobile version