Site icon NTV Telugu

Bollywood: అమితాబ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…

Ganapath

Ganapath

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 మేలో చేసిన లడాఖ్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘గణపత్’ సినిమా 2022లోనే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. మేకర్స్ మాత్రం 2023 సమ్మర్ ని కూడా వదిలేసి డైరెక్ట్ గా 2023 అక్టోబర్ ని వెళ్లిపోయారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాదిన్నర సమయం పట్టే అంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాని చేశారో లేక మరేదైనా కారణమా అనేది తెలియదు కానీ గణపత్ సినిమా పార్ట్ 1ని అక్టోబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఈ సినిమా కారణంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తన సినిమా ‘ఎమర్జెన్సీ’ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కావాల్సి ఉండగా, కంగనా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాను అని ట్వీట్ చేసింది.

Exit mobile version