NTV Telugu Site icon

Tiger Nageswara Rao: పీఎం సెక్యూరిటీకే వణుకు పుట్టించిన టైగర్ నాగేశ్వరరావు

Tigernageswararao Trailer

Tigernageswararao Trailer

Tiger Nageswara Rao Trailer Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు వంశీ డైరెక్షన్లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కి రెడీ అవుతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ కాగా రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ముంబై వెళ్లి మరీ హిందీ ట్రైలర్ తో పాటు మిగతా అన్ని బాషల ట్రైలర్లు రిలీజ్ చేశారు.

Hi Nanna: ఇది లవ్ స్టోరీనే ‘గాజు బొమ్మ’… ఈ పాటే సినిమాకి ప్రాణం

2 నిముషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలు పెంచేలా సాగింది. ముందుగా దొంగతనానికి వెళ్లేందుకు దొంగలు అందరూ ప్రాంతాలను పాడుకుంటున్న సీన్ ను చూపించి ఎలా ఉండనుంది అనే విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చారు. తరువాత సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ చేస్తున్నానని ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ దొంగతనానికి వెళ్తాడని నాగేశ్వర రావు క్యారెక్టర్ ను చూపే ప్రయత్నాం చేశారు. ఆ తరువాత సారా అనే అమ్మాయితో ఫ్లర్ట్ చేయడం కూడా చూపించారు. అయితే అతన్ని చంపడడం కోసమే ఒక ఆఫీసర్ తిరుగుతున్నాడని చెబుతూ జిషు సేన్ గుప్తాను పరిచయం చేశారు. ఇక పీఎం ప్రాణాలకే ఇబ్బంది అని సెక్యూరిటీ అంతా వణికిపోతున్నట్టు చూపించడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే స్టువర్ట్ పురం నాగేశ్వరరావు టైగర్ గా ఎలా మారాడు, అనేది చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాక నాగేశ్వరరావు సిక్కుగా మారినట్టు ఒక షాట్ చూపించగా మరోపక్క ఇందిరా గాంధీని చూపించడంతో ఇదేదో కొత్త లింకు క్రియేట్ చేసినట్టు ఉన్నారే అనిపిస్తోంది.

Show comments