Site icon NTV Telugu

Tiger Nageswara Rao: టైగర్ వచ్చే టైమ్ ఆసన్నమైంది.. సిద్దంకండి

Raviteja

Raviteja

Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అయింది.

Month Of Madhu Trailer: సెటిల్ మెంట్ దేనికండీ.. ప్రేమించినందుకా..

ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ కానుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 3 ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు రవితేజ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఊర మాస్ అవతారంలో రవితేజ కనిపించాడు. నోట్లో బీడీ పెట్టుకుని ఫైట్ లో ఒక విలన్ ను మట్టి కరిపిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version