Site icon NTV Telugu

Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao వేట మొదలైంది. తాజాగా Tiger Nageswara Rao నుంచి స్టన్నింగ్ ప్రీ లుక్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. ఈ ప్రీ లుక్ లో రవితేజ ఒక ట్రైన్ ముందు పవర్ ఫుల్ లుక్ లో కన్పిస్తున్నారు. ప్రీ లుక్ టీజర్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో Tiger Nageswara Rao మూవీ లాంచ్ గ్రాండ్ గా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. అలాగే సినిమా ప్రీ లుక్ ను విడుదల చేసి చిత్రబృందానికి తన బెస్ట్ విషెస్ అందించారు.

Read Also : Rashmika Mandanna : క్రేజీ ఆఫర్… ‘యానిమల్’ వరల్డ్ లో నేషనల్ క్రష్

“టైగర్ నాగేశ్వరరావు” రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం కానుంది. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version