Site icon NTV Telugu

Tiger Nageswara Rao : ప్రీ లుక్, లాంచ్ కు టైమ్ ఫిక్స్

Tiger-Nageswara-rao

మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్, లాంచ్ ఎప్పుడు ? వంటి విషయాలను కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?

Tiger Nageswara Raoని ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఈ రోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదే రోజున 12 గంటలకు సినిమా ప్రీ-లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ పాన్-ఇండియన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

Exit mobile version