బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. రవితేజ ఫాన్స్ చాలా రోజులుగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యండి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. అభిమానులు ఎంత అడిగినా మేకర్స్ మాత్రం సైలెంట్ గా తమ పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ సోషల్ మీడియాలో రవితేజ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. “ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది. టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలి తో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను . ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు. వేటకి సిద్ధమా?” అంటూ వంశీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో రవితేజ ఫాన్స్ హ్యాపీ అయ్యారు. మరి ఫస్ట్ లుక్ ఎప్పుడు బయటకి వస్తుంది? మేకర్స్ ఫిక్స్ చేసిన ముహూర్తం ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు
మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది.
టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు.— VAMSY (@DirVamsee) May 15, 2023
