1990 నుంచి జరుగుతున్న తల అజిత్, దళపతి విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోస్ గా చలామణీ అవుతున్న ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ యుద్ధానికి దిగే విజయ్, అజిత్ ఫాన్స్ మరోసారి గ్రౌండ్ లెవల్ వార్ కి రెడీ అయ్యారు. అజిత్ నటిస్తున్న ‘తునివు’, విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాలు 2023 సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. రెండు భారి సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్స్ లోకి వస్తుండడంతో ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు అనే దగ్గర నుంచి మొదలైన ఈ ‘రిలీజ్ వార్’లో రోజులు గడుస్తున్న కొద్ది హీట్ పెరుగుతోంది.
మేకర్స్ కూడా వారిసు, తునివు సినిమాలని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాలపై అంచనాలు పెంచుతున్నారు. వారిసు నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయితే తునివు నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఇలా కాంపిటీటివ్ గా సాగుతున్న రెండు సినిమాల ప్రమోషన్స్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ దగ్గర వచ్చి ఆగాయి. తునివు ట్రైలర్ కోసం అజిత్ ఫాన్స్ వెయిట్ చేస్తుంటే, వారిసు ట్రైలర్ కోసం విజయ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు హీరోల ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ న్యూ ఇయర్ సంధర్భంగా రెండు సినిమాల ట్రైలర్స్ బయటకి రాబోతున్నాయి. వీటిలో అజిత్ ‘తునివు’ డిసెంబర్ 31న బయటకి వస్తుండగా, విజయ్ ‘వారిసు’ ట్రైలర్ జనవరి 2న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ యుట్యూబ్ ని షేక్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం రెండు సినిమాలు హిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకటి ఫ్యామిలీ డ్రామా కాగా మరొకటి యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో రూపొందింది. సో ఏ జానర్ సినిమాని చూడడానికి ఆ జానర్ అభిమానులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వేరు వేరు జానర్స్ లో తెరకెక్కాయి కాబట్టి సినిమాలో విషయంలో ఉంటే రెండు సినిమాలు హిట్ అవుతాయి.
