Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!

Tollywood Deaths

Tollywood Deaths

Three Back to Back Deaths in Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొన్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కన్నుమూయడం షాక్ కలిగిస్తోంది. ప్రముఖ చిత్ర కారుడు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పిట్టంపల్లి సుదర్శన్‌ అలియాస్‌ దాసి సుదర్శన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మిర్యాలగూడలోని తన స్వగృహంలో సోమవారం నాడు గుండెపోటుకు గురయి కన్నుమూశారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 88లో బి నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన ‘దాసి’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసి ఆ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు సుదర్శన్‌. అప్పటినుంచి దాసి సుదర్శన్‌ గా ఆయన గుర్తింపు పొందారు. ఇక వారం రాత్రి 8 గంటల సమయంలో డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తూ వచ్చిన శ్రీ రామకృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

Jagapathi Babu: డబ్బున్న పేదవాడిని.. మరో లెజెండ్ కోసం ఎదురు చూస్తున్నా!

తమిళ సినీ దర్శకులు శంకర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఎన్నో తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణ మాటలు అందిస్తూ ఉండేవారు. చివరిగా రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమాకి ఆయన మాటలను అందించారు. సుమారు 74 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఇక తాజాగా సినీ పరిశ్రమకు చెందిన నటుడు ఒకరు కన్నుమూశాడు. ఎన్నో తమిళ, తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. 62 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. ఇక విశ్వేశ్వరరావు స్వస్థలం కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కమెడియన్ గా అలరించారు.

Exit mobile version