MS Prabhu: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే సినిమాటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానని ఒక మలయాళ డైరెక్టర్ బెదిరించడం కలకలం సృష్టిస్తోంది. డైరెక్టర్ బెదిరింపులకు భయపడిన సినిమాటోగ్రాఫర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఎంఎస్ ప్రభు.. సీనియర్ సినిమాటోగ్రాఫర్. 30 ఏళ్లుగా ఎన్నో సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ఇక ఇతనికి 2016 లో సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. హీరోయిన్ పద్మప్రియ తో ఒక భారతీయార్ వీడియో సాంగ్ చేయాలనీ చెప్పి ప్రభును అడుగగా.. ఆయన అదేవిధంగా వీడియో తయారుచేసి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నిరోజులు సూర్య, పద్మప్రియ ఫోన్ నెంబర్ కావాలని ప్రభును ఒత్తిడిచేయడం మొదలుపెట్టాడు.
కాగా ఆమె నెంబర్ ఎందుకు అని అడిగినా సరైన సమాధానం చెప్పకుండా నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను అత్యాచారం చేస్తాను అని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన ప్రభు.. వెంటనే రామాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో ” సూర్య అనే వ్యక్తి .. నటి పద్మప్రియ ను పరిచయం చేయాల్సిందిగా, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా నన్ను బెదిరిస్తున్నాడు. నెంబర్ ఇవ్వకపోతే నా భార్యను అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. దయచేసి అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. నటి పద్మప్రియ తెలుగువారికి కూడా ఆసుపరిచితమే.. ఆది పినిశెట్టితో కలిసి మృగం.. శర్వానంద్ తో కలిసి అందరి బంధువయా చిత్రాల్లో నటించి మెప్పించింది.