Site icon NTV Telugu

Thota Tharani: తోట తరణి ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు..

Thota Tharani Chevalier Award,

Thota Tharani Chevalier Award,

భారత సినీ రంగానికి మరో గర్వకారణం. ప్రఖ్యాత ఆర్ట్‌ డైరెక్టర్‌ తోట తరణికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత సత్కారం ‘చెవాలియర్‌’ (Chevalier Award) కు ఆయనను ఎంపిక చేసింది. చెన్నైలోని ఫ్రెంచ్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో రేపు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తోట తరణికి అభినందనలు తెలిపారు.

Also Read : Divya Pillai: బెడ్ సీన్స్‌లో హీరోల కింద మేము నలిగిపోవాల్సిందే.. దివ్య పిళ్లై బోల్డ్ కామెంట్స్

“గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో అద్భుతమైన సెట్‌ డిజైన్‌లతో మాయ చూపించారు. ‘నాయకుడు’, ‘ఇంద్ర’, ‘దసరథి’, ‘జనతా గ్యారేజ్’, ‘తలపతి’ వంటి సినిమాల్లో ఆయన సృష్టించిన సెట్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి తోట తరణి గారు,” అని స్టాలిన్ పేర్కొన్నారు.ఇక ఆయనకు ఇప్పటికే మూడు నేషనల్‌ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు లభించాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ‘చెవాలియర్‌’ అవార్డు పొందడం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సినీ, కళా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఈ గౌరవం అందజేస్తున్నట్లు ఫ్రెంచ్‌ అధికారులు తెలిపారు.

Exit mobile version