Site icon NTV Telugu

DVV : OG పై అవన్ని పుకార్లే.. ఆయన రావడం పక్కా

Tollywood

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్గెస్ట్ డిజాస్టర్

కాగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా సెప్టెంబర్ రిలీజ్ పోస్ట్ పోన్ అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. అందుకు విశ్వంభర కూడా ఒక కారణం అయింది. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న విశ్వంభర ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దాంతో OG వాయిదా వేస్తారని భావించారు. ఈ వార్తలపై మేకర్స్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ OG వాయిదా అనేది ఉండదు. ముందుగా చెప్పినట్టు సెప్టెంబర్ రిలీజ్ పక్కా. అసలు పవర్ స్టార్ సినిమాపై ఎటువంటి విషయం ఉన్న మేమే చెప్తాం. పుకార్లను నమ్మొద్దు అని తెలియజేసారు. దింతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరో రెండు నెలల్లో పవర్ స్టార్ పవర్ఫుల్ యాక్షన్ వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version