NTV Telugu Site icon

Friday Releases: ఈవారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!

Friday

Friday

Tollywood: ఈ నెల 3వ తేదీన విడుదలైన ‘బలగం’ తర్వాత ఆ స్థాయిలో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసి థియేటర్లలో సందడి చేసిన సినిమాలేవీ రాలేదు. గత వారం వచ్చిన ఆది సాయికుమార్ ‘సి.ఎస్.ఐ. సనాతన్’తో సహా మిగిలిన ఐదారు సినిమాలు కూడా ఎలాంటి హడావుడీ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో 17వ తేదీ నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రెండు అనువాదచిత్రాలు కాగా, మరో రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. నాగశౌర్య, మాళవిక నాయర్ రెండో సారి జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలానే `దుర్మార్గుడు` ఫేమ్ విజ‌య్ కృష్ణ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `గ‌ణా`. సుక‌న్య‌, తేజు హీరోయిన్స్ గా న‌టించారు. ఈ సినిమా కూడా ఫ్రై డే వస్తోంది.

ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే… కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర సుపరిచతుడు. ఆయన హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది ‘కబ్జా’ చిత్రం. పునీత్ రాజ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రేపు రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో విడుదల అవుతోంది. అలానే ఆంగ్ల చిత్రం ‘షజామ్ : ప్యూరీ ఆఫ్ ది గాడ్స్’ కూడా తెలుగులో డబ్ అయి శుక్రవారం రాబోతోంది. మరి ఈ నాలుగు సినిమాలలో ప్రేక్షకులు దేనికి ఓటు వేస్తారో చూడాలి.

Show comments