This Star Heroine Under Consideration For SSMB29: అవును, మహేశ్ బాబు – రాజమౌళి సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అయితే, ఈలోపే ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్‌గానే మహేశ్‌తో తాను తీయబోయేది ‘గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్’ అని ఈ సినిమా జోనర్‌ను జక్కన్న రివీల్ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇందులో కథానాయిక పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను కన్ఫమ్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ, ఆ బ్యూటీ ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. ఆలియా భట్. ఈ బాలీవుడ్ బ్యూటీ ఆల్రెడీ జక్కన్నతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆలియా నటనకు ముగ్ధుడైన జక్కన్న, తాజాగా మహేశ్‌తో చేయబోయే సినిమాలో మరోసారి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అఫ్‌కోర్స్.. ఆలియా భట్ ప్రస్తుతం గర్భంతో ఉంది. అయితే, SSMB29 సినిమా సెట్స్ మీదకి వెళ్లేలోపు బిడ్డకు జన్మనిచ్చి, ఆమె తిరిగి ఫిట్‌గా తయారు కానుంది. సాధారణంగా సెలెబ్రిటీలు మరో బిడ్డ కోసం కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు. అసలే ఆలియా భట్ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. కాబట్టి, మొదటి బిడ్డ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకుందట! ఈ నేపథ్యంలోనే మహేశ్ సినిమాలో ఆలియాని తీసుకోవడానికి జక్కన్న ఫిక్స్ అయినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి, ఇందులో ఎంతవరకు నిజముందో తేలాలంటే, అధికారిక సమాచారం వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే! అయితే.. ఇదే సమయంలో మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె పేరు కూడా చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఆలియా భట్ పూర్తిగా కుదురుకోకపోతే, ఆమె స్థానంలో దీపికాని తీసుకోవాలని జక్కన్న ఆప్షన్‌గా పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఏదేమైనా.. సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయమే ఉంది కాబట్టి, హీరోయిన్ విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము. లెట్స్ వెయిట్ అండ్ సీ!
కాగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జక్కన్న స్థాయి విపరీతంగా పెరిగింది కాబట్టి, మహేశ్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్‌పై చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. ఈసారి అంతకుమించిన కంటెంట్‌తో సత్తా చాటాలని చూస్తున్నాడు. అందుకేనేమో, గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోందని, త్రివిక్రమ్‌తో మహేశ్ చేస్తోన్న సినిమా విడుదలయ్యాక ఈ సినిమా షూటింగ్‌ను రెగ్యులర్‌గా నిర్వహించాలని జక్కన్న పక్కా ప్లాన్ వేసుకున్నాడని అంటున్నారు.