NTV Telugu Site icon

Naatu Naatu: మన పాటకి ఆస్కార్స్ లో గట్టి పోటీ ఇచ్చేది ఈ సాంగ్ మాత్రమే…

Naatu Naatu

Naatu Naatu

ఈరోజు జరగనున్న ఆస్కార్స్ వేడుకపై ప్రతి భారతీయుడు దృష్టి పెట్టాడు. ముందెన్నడూ లేనంతగా ఆస్కార్స్ ఈవెంట్ ని చూడడానికి ఇండియన్స్ ఈగర్ గా వెయిట్ చెయ్యడానికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్స్’కి నామినేట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని వెస్ట్రన్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చెయ్యడంలో కీ రోల్ ప్లే చేసింది నాటు నాటు సాంగ్. మన పాట ఆస్కార్ అవార్డ్ గెలవడం గ్యారెంటీ అనే నమ్మకంలో ప్రతి ఒక్కరూ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి నాటు నాటు తో పాటు పోటీలో ఉన్న సాంగ్స్ లిస్ట్ చూస్తే… ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ నుంచి ‘అప్లాజ్’, ‘టాప్ గన్ మెవరిక్’ నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’, ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ నుంచి ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘బ్లాక్ పాంథర్’ నుంచి ‘లిఫ్ట్ మీ అప్’ పాటలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నాయి.

Read Also: Urfi Javed : వెదురు బుట్టలే ఉర్ఫీ బట్టలు

బెస్ట్ సాంగ్ కేటగిరిలో నిలిచిన ఈ పాటల్లో అన్నింటికన్నా నాటు నాటు సాంగ్ కి అత్యంత పోటీ ఇచ్చే అవకాశం ఉన్న సాంగ్ ‘లిఫ్ట్ మీ అప్’. బ్లాక్ పాంథర్ సినిమాలోని ఈ సాంగ్ ని ‘రిహాన్నా’, ‘టేమ్స్’, ‘ర్యాన్ కూగ్లర్’ కంపోజ్ చేశారు. హాలీవుడ్ మేజర్ టెక్నీషియన్స్, మ్యూజిక్ లవర్స్ ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ కి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్స్ ఇచ్చిన ప్రిడిక్షన్స్ ప్రకారం నాటు నాటు vs లైఫ్ మీ అప్ సాంగ్ ల మధ్య ఫైట్ గట్టిగానే జరుగనుంది. ఫైనల్ అనౌన్స్మెంట్ వరకూ ఈ రెండు పాటల్లో ఏ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ తీసుకుంటుంది అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దాదాపు నాటు నాటు సాంగ్ కే ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ నాటు నాటుకి కాకపోతే ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ కి ఆస్కార్ వస్తుంది. మరి ఈ పాటల యుద్ధంలో ఎవరు గెలిచి ఆస్కార్ వేదికపై అవార్డుని అందుకుంటారో చూడాలి.