Sridevi Vijay Kumar: ఈశ్వర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం శ్రీదేవి. నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇక కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన శ్రీదేవి.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. 2009లో రాహుల్ అనే వ్యక్తిని వివాహమాడిన శ్రీదేవి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఆమె పెళ్లి తరువాత చేసిన చిత్రం అంటే వీర అనే చెప్పాలి. రవితేజకు చెల్లెలిగా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ శ్రీదేవిని చూసి అభిమానులు బాగానే మెచ్చుకున్నారు. పెళ్లి అయ్యి, ఒక బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఇంకా శ్రీదేవి.. తన మొదటి సినిమా ఈశ్వర్ సినిమాలో ఎలా ఉందో అలానే ఉంది. సినిమాల్లో నటించకపోయినా శ్రీదేవి తెలుగువారికి మాత్రం దూరం కాలేదు. డ్యాన్స్ షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం అప్పటి హీరోయిన్లు అందరూ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడం ట్రెండీగా మారింది. మరి శ్రీదేవి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా.. ? అని అందరూ అడుగుతున్న విషయం తెల్సిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.. అంటే ఇంట్లో మీ భర్త ఒప్పుకోలేదా.. ? అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ” పెళ్లి తరువాత సినిమాలు ఆపమని నాకెవ్వరు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే నా భర్తనే నన్ను ఎక్కువ ప్రోత్సహించాడు. సినిమాలు చెయ్యి.. పర్లేదు అని చెప్పాడు. కానీ, నేనే కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకు కారణం.. పెళ్లి. ప్రతి అమ్మాయి జీవితంలో అది చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తరువాత జీవితానికి అలవాటు పడడానికి నేను టైమ్ తీసుకోవాలనుకున్నాను. అలాగే టైమ్ తీసుకున్నాను. అందుకే సినిమాలకు దూరం అయ్యాను. సినిమాలకు దూరం అయ్యాను కానీ షోస్ ద్వారా అందరికి దగ్గరగానే ఉన్నాను.. ఐదేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చినదాన్ని.. దానికి దూరంగా ఉండాలని ఎన్నడూ అనుకోను” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ చిన్నాడు ముందు ముందు రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
