Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Oh Sukumari (2)

Oh Sukumari (2)

Oh Sukumari: తెలుగు సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే ప్రేమకథలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా, డిఫరెంట్ ఆలోచనతో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఓ సుకుమారి’ సినిమా 2026 జూలై 17న థియేటర్లలో విడుదల కానుంది. ఒక ఎలక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కథలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండబోతోంది. హీరో హీరోయిన్‌ను తాకిన ప్రతిసారి షాక్ కొట్టడం కథలో మైన్ పాయింట్ గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి ప్రేమ ఎలా సాగింది? చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనే అంశాల చుట్టూ కథ నడవనున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా ఇదే కాన్సెప్ట్‌కు అనుగుణంగా డిజైన్ చేశారు. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ కొత్త తరహా ప్రేమకథ ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్ చేసేలాగే కనబడుతోంది. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, విడుదలకు ముందు మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌లను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్‌లు, వినూత్నమైన ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ‘ఓ సుకుమారి’ ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు జూలై 17న థియేటర్లలోకి రానున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.