NTV Telugu Site icon

Most Expensive Movies : టాలీవుడ్‌లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..

Most Movies

Most Movies

టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు గ్లోబల్ లెవల్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కల్కి 2898 AD..

గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ మూవీని రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుచెందిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.. జూన్ లో సినిమా విడుదల కాబోతుంది.

పుష్ప 2..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్నారు.. ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా దాదాపు 500 కోట్లతో తెరకేక్కుతుంది.

గేమ్ ఛేంజర్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాకు ఏకంగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం..

దేవర..

గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర.. కొరటాల దర్శకత్వం లో తెరకేక్కుతుంది.. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు..

అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కూడా 300 కోట్ల తో తెరకెక్కుతుంది..

Show comments