Site icon NTV Telugu

Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే!

Kingdom

Kingdom

Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ విడుదలపై వస్తున్న వార్తలకు నిర్మాత నాగవంశీ స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో కింగ్‌డమ్ విడుదల వాయిదా పడుతుందనే పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నాగవంశీ ఈ వార్తలను ఫేక్‌గా పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగవంశీ ఈ మేరకు పేర్కొన్నట్టు సమాచారం. “కింగ్‌డమ్ పోస్ట్‌పోన్ అనే ఆలోచన ఇప్పటివరకు లేదు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌తో ఏదైనా క్లాష్ అయితే, అలాంటి ఆలోచన చేయచ్చు. కానీ, ప్రస్తుతానికి జులై 4న విడుదల పక్కా. ఒకటి రెండు రోజుల్లో సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు వచ్చిన వార్తలు పూర్తిగా ఫేక్” అని స్పష్టం చేశారు. కింగ్‌డమ్ సినిమా విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Read Also : AR Rahman : రెహమాన్ ను అభినందించిన సింగపూర్ అధ్యక్షుడు..

ఈ చిత్రం ఒక యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక దాని రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదని నిర్మాత స్పష్టం చేయడం ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే అంశం. అయితే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీతో క్లాష్ అయ్యే అవకాశం ఉంటే, కింగ్‌డమ్ రిలీజ్ డేట్‌పై పునరాలోచన చేసే ఆలోచన ఉండవచ్చని నాగవంశీ హింట్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా గత కొన్ని సంవత్సరాలుగా ఆలస్యమవుతూ వస్తోంది, మరియు ఇటీవల జూన్ 12, 2025 నుంచి జులై 4 లేదా జులై 11కి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి కానీ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ టీమ్ జులై 4న తమ సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే వేగం పుంజుకున్నాయనే చెప్పాలి.

Read Also : Shobha Shetty : వాటికి బ్రేక్ ఇచ్చిన శోభాశెట్టి.. అసలేం జరిగింది..?

Exit mobile version