NTV Telugu Site icon

PS 2: చోళులు చెప్పిన రోజే వస్తున్నారు…

Ps 2

Ps 2

పొన్నియిన్ సెల్వన్… మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా. పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. ఊహించిన దాని కన్నా పొన్నియిన్ సెల్వన్ 1 పెద్ద హిట్ అయ్యింది కానీ తమిళనాడు మినహా ఎక్కడా ఆశించిన స్థాయి కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయింది. స్లో ఉంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడం, సినిమా మొత్తం తమిళ నేటివిటికి తగ్గట్లు ఉండడంతో PS-1 సినిమా ఇతర భాషల్లో ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు. ఇదిలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అవ్వట్లేదు, వాయిదా పడబోతుంది అనే టాక్ వినిపిస్తోంది.

Read Also: Sudheer Babu: సుధీర్ అన్నా నువ్వా… సడన్ గా చూసి అల్లరి నరేష్ అనుకున్నాం

ఈ రూమర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. PS-2 సినిమా వాయిదా పడలేదు, ఇప్పటికే అనౌన్స్ చేసిన డేట్ ప్రకారమే ఏప్రిల్ 28నే రిలీజ్ అవుతుంది అంటూ క్లియర్ గా చెప్పేశారు. ఈ అనౌన్స్మెంట్ తో PS-2 వాయిదా పడుతుంది అనే రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే PS-2 రిలీజ్ అవుతున్న రోజే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ కానుంది. తెలుగులో భారి అంచనాలు ఉన్న ఏజెంట్ సినిమా కారణంగా PS-2కి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.