There will be a Film with Raviteja in cinematic universe says Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సంక్రాంతికి హనుమాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ రోజు ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటిస్తూనే ఒక గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసి తమ సినిమాని ఇంత సూపర్ హిట్ చేసిన సందర్భంగా అభిమానులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది ఈ సినిమా యూనిట్. ఇక ఈవెంట్ లోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రవితేజతో ఒక సినిమా ఉండబోతుందని ప్రకటించారు.
Hanuman: ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు.. ఎందుకంటే?
అయితే రవితేజ కి ఇంకా కథ చెప్పలేదు కానీ ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. హనుమాన్ సినిమాలో కోటి అనే ఒక కోతి ఉంటుంది. దానికి రవితేజ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఆ పాత్రను లీడ్ గా తీసుకొని ఒక సినిమా చేయాలని ఐడియా వచ్చిందని త్వరలోనే ఆ ఐడియా రవితేజ గారికి చెబుతానని ఆయన ఒప్పుకుంటే తమ సినిమాటిక్ యూనివర్స్ లో మరొక సినిమా యాడ్ అవుతుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ కు కూడా కొన్ని కథలు సిద్ధం చేశానని ఆయన చేస్తాను అంటే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సినిమా తెరకెక్కుతుంది లేదంటే ఇండివిడ్యువల్ గా ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో తనను ముందు నుంచి రవితేజ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ వచ్చారని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.