నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలలో నటించగా అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుట ఎండలో సముద్ర తీరాన ఇసకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తుడులు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ప్రేక్షకులంతా ఎంకరేజ్ చేసి ఈ సినిమాను గణ విజయం చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
