Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..

Theatrical Releases 1 300kb

Theatrical Releases 1 300kb

Theatrical Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సినిమాలు సిద్ధమయ్యాయి. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్, పంజాబీ కామెడీలు, తెలుగు యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో థియేటర్లలో సందడి చేయబోతున్న టాప్ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ మాత్రం సినీ లవర్స్ పండుగ చేసుకోబోతున్నట్లే కనిపిస్తోంది ఈ లిస్ట్ చూస్తుంటే . మరెందుకు ఆలస్యం ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండి.

హైవాన్ (Haiwaan)

బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సుమారు 18 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. దర్శకుడు ప్రియదర్శన్ తన మలయాళ హిట్ ‘ఒప్పం’ సినిమాకు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న (శుక్రవారం) ఆటలతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కంటి చూపు లేని ఒక మార్షల్ ఆర్టిస్ట్‌గా నటిస్తుండగా, అక్షయ్ కుమార్ అత్యంత క్రూరమైన సైకో కిల్లర్‌గా కనిపిస్తున్నారు. ఒక చిన్న పాపను ఆ సైకో కిల్లర్ బారి నుండి కాపాడటానికి ఆ బ్లైండ్ మార్షల్ ఆర్టిస్ట్ ఎలాంటి పోరాటం చేశాడనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ.

సింగ్ వర్సెస్ కౌర్ 2 (Singh Vs Kaur 2)

పంజాబీ రాకింగ్ స్టార్ గిప్పీ గ్రెవాల్, బిగ్‌బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ జంటగా నవనియాత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా పంజాబీ మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇది 2013 నాటి సూపర్ హిట్ పంజాబీ చిత్రం ‘సింగ్ వర్సెస్ కౌర్’ కి అధికారిక సీక్వెల్. కెనడా, పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాలో ఒక పల్లెటూరి అబ్బాయి, మోడ్రన్ అమ్మాయిల మధ్య జరిగే పెళ్లి గొడవలు, ఫన్నీ మిస్-అండర్‌స్టాండింగ్స్ తో ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించనుంది.

ఫాల్ 2: డెడ్ పాయింట్ (Fall 2: Deadpoint)

2022లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన సర్వైవల్ థ్రిల్లర్ హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫాల్’ (Fall) కి ఇది మైండ్-బ్లోయింగ్ సీక్వెల్. 2026 సెప్టెంబర్ 11 (శుక్రవారం) నుండి ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. గత ప్రమాదంలో తన సోదరిని కోల్పోయిన తీవ్రమైన మానసిక బాధలో ఉన్న జ్యాక్స్ (హ్యారియెట్ స్లేటర్), తన సోదరి జ్ఞాపకార్థం థాయ్‌లాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన, నిటారుగా ఉండే ఒక భారీ పర్వతాన్ని ఎక్కడానికి బయలుదేరుతుంది. అయితే ఊహించని వాతావరణ మార్పుల వల్ల వారు కొండపైనే చిక్కుకుపోతారు. కిందకు దిగడానికి ఎలాంటి దారి లేని ఆ డెడ్‌పాయింట్ నుండి కేవలం వారి ప్రాణాలను కాపాడుకోవడానికి వారు చేసే ఊపిరిసలపనివ్వని పోరాటమే ఈ హై-అడ్రినలిన్ సర్వైవల్ థ్రిల్లర్.

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (Epic – First Semester)

‘బేబీ’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ఈ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘#90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న విడుదల కానుంది. లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళిన ఒక మధ్యతరగతి తెలుగు యువకుడి జీవితం, అక్కడ కాలేజీ రోజుల్లో వైష్ణవితో చిగురించిన అందమైన ప్రేమ, ఆ తర్వాత వారి మధ్య వచ్చే బ్రేకప్, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక ఆధ్యాత్మిక పౌరాణిక మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రాచీన దైవిక రహస్యాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా కూడా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తోంది.

సర్దార్ 2 (Sardar 2)

తమిళ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ క్రేజీ సీక్వెల్ తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 10న విడుదల కానుంది.

మారెమ్మ (Maremma)

రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతీరాజు హీరోగా పరిచయమవుతున్న రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ఇది. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పల్లెటూరి కథాంశం సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతోంది.

మందాడి (Mandaadi)

వర్సటైల్ యాక్టర్ సుహాస్ లీడ్ రోల్‌లో నటించిన ఈ వినూత్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కూడా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది.