Theater Plus: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!

Theater Plus Movies

Theater Plus Movies

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది భారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు. జేబులు గుల్ల చేసుకుంటే తప్ప మంచి కంటెంట్ చూడలేని పరిస్థితి. కానీ, అలాంటి ఈ రోజుల్లో ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త ఫ్లాట్ ఫామ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ప్రకటించింది. అదే ‘థియేటర్ ప్లస్’. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండా, అసలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఉచితంగా ఈ వారం మూడు అద్భుతమైన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందిస్తూ ఈ ఓటీటీ సంస్థ సంచలనం సృష్టిస్తోంది.

1. మైండ్ బ్లాంక్ చేసే లీగల్ థ్రిల్లర్ ‘గుమాస్తా’
చట్టంలోని లొసుగులు పూర్తిగా తెలిసిన ఓ న్యాయవాది క్లర్క్.. తన భార్య అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా మారితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? సరిగ్గా ఈ పాయింట్ చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన చిత్రమే ‘గుమాస్తా’. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని అతను ఆడే పిల్లి ఎలుకల ఆట ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఎప్పటికప్పుడు వచ్చే ఊహించని మలుపులు, క్లైమాక్స్ లో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులకు ఆడియన్స్ థ్రిల్ అవ్వడం గ్యారెంటీ.

2. కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమకథ ‘నాలుగు వసంతాలు’
కాలేజ్ డేస్ అనగానే ఎవరికైనా తీపి గుర్తులు గుర్తొస్తాయి. అలాంటి నాలుగేళ్ల కాలేజ్ ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రమే ‘నాలుగు వసంతాలు’. కాలేజీ క్యాంపస్ లో పుట్టే స్వచ్ఛమైన ప్రేమ, ఫ్రెండ్ షిప్, బ్రేకప్స్.. ఇలా యువత కనెక్ట్ అయ్యే సున్నితమైన ఎమోషన్స్ ను ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. కాలేజ్ నుంచి బయటకు వెళ్లే సమయానికి ఆ జంట ప్రేమకథలో ఎలాంటి కుదుపులు చోటు చేసుకున్నాయనేది ఈ కథకు హైలైట్.

3. ఊపిరి బిగబట్టి చూసే ‘జై గణేష్’
సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ వారం థియేటర్ ప్లస్ లో పండగే. ఒక చిన్న పిల్లాడి కిడ్నాప్.. దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యంలో సాగే సినిమానే ‘జై గణేష్’. కిడ్నాపర్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ ఆసాంతం ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది. కేసు విచారణలో ఒక్కో చిక్కుముడి విడిపోయే విధానం, నేరస్తుడిని పట్టుకునే క్రమంలో వచ్చే ట్విస్టులు చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే.

ఇలా లీగల్ థ్రిల్లర్, రొమాంటిక్ లవ్ స్టోరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. అనే మూడు విభిన్నమైన జానర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలను ‘థియేటర్ ప్లస్’ వేదికగా ఉచితంగా ఎంజాయ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ గొడవ లేకుండా ఈ వీకెండ్ కి ఈ మూడు సినిమాలతో ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వండి!