Site icon NTV Telugu

Raviteja: టైగర్ కి పెరుగుతున్న థియేటర్ కౌంట్… విక్రమార్కుడు తర్వాత ఇదే ఫస్ట్ టైమ్

Raviteja

Raviteja

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి వచ్చింది. క్రిటిక్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసారు కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని యాక్సెప్ట్ చేసారు. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో ఎలివేషన్స్ ఇచ్చి మరీ లేపుతున్నారు. విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది టైగర్ నాగేశ్వర రావు సినిమాలోనే… మాస్ పెర్ఫార్మెన్స్ అంటూ రవితేజ ఫ్యాన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. డే 1తో పోల్చుకుంటే డే 2 టైగర్ నాగేశ్వర రావు కలెక్షన్స్ లో సాలిడ్ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ.

లియో, భగవంత్ కేసరి సినిమాల రిలీజ్ కారణంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాకి ఆశించిన స్థాయి థియేటర్స్ రాలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్ మా హీరో సినిమాకి తక్కువ థియేటర్స్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసారు. ఇప్పుడు డే 2 నుంచి అన్ని సెంటర్స్ లో భగవంత్ కేసరి సినిమాకి థియేటర్స్ పెరుగుతున్నాయి. లియో, భగవంత్ కేసరి నుంచి థియేటర్స్ టైగర్ నాగేశ్వర రావుకి షిఫ్ట్ అవ్వనున్నాయి. మొదటి రోజు టైగర్ నాగేశ్వర రావు సినిమాకి 500-600 థియేటర్స్ మాత్రమే లభించాయి. ఇప్పుడు ఈ కౌంట్ 800 వరకూ చేరనుంది. ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది కాబట్టి టైగర్ నాగేశ్వర రావు సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఈ ఆడియన్స్ ని మండే వరకూ హోల్డ్ చేయగలిగితే చాలు టైగర్ నాగేశ్వర రావు సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ మార్క్ చేరినట్లే.

Exit mobile version