Site icon NTV Telugu

Kuberaa : కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్..

Kuberaa

Kuberaa

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Also Read : Kannappa : ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. కారణమేంటి.?

అయితే నైజాంలో కుబేర సినిమా చూసేందుకు వెళ్లిన ఆడియెన్స్ కు మర్చిపోలేని గాయాన్ని ఇచ్చింది థియేటర్ యాజమాన్యం. మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్‌లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకులపై థియేటర్ సీలింగ్ పైకప్పు ఒక్కసారిగా ఊడిపడింది. దాంతో సినిమా చూస్తున్న పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అలాగే థియేటర్ యాజమాన్యంతో  గొడవకు దిగారు ప్రేక్షకులు. ప్రేక్షకుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా చూసేందుకు వస్తే ఇలా గాయాలతో వెళ్తామని ఊహించలేదని వాపోయారు ప్రేక్షకులు.

Exit mobile version