Site icon NTV Telugu

Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

Jani Master

Jani Master

లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది వచ్చిన పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్.

Also Read : Havish : రోజుకొక సినిమా రిలీజ్ చేయాలని ఉంది

అయితే జానీ మాస్టర్ కు ఇప్పుడు ఓ బిగ్ ఆపర్చునిటీ  వచ్చినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్నపెద్ది సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం, బ్రుస్ లీ, ఎవడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలోని సాంగ్స్ కు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ ను ఇండస్ట్రీ దూరం పెట్టింది. మళ్ళి ఇన్నాళ్లకు ఓ స్టార్ హీరో పిలిచి మరి అవకాశం ఇవ్వడంతో ఈ సాంగ్ ను ఓ రేంజ్ లో ప్లాంక్ చేస్తున్నాడట. జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేసిన సాంగ్ సినిమాలో హైలెట్ గా నిలవబోతుందట.  భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుస్తుండగా మైత్రీ మూవీస్,వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

Exit mobile version