డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఆంధ్రప్రదేశ్‌లో తన బాక్సాఫీస్ వేటను భారీ స్థాయిలో మొదలు పెట్టబోతోందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్‌తో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా టికెట్ ధరల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ఈ హారర్-కామెడీ డ్రామా కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి అప్పుడే మొదలై పోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు రావడంతో, భారీ టికెట్ ధరలతోనే ‘రాజా సాబ్’ తన పవర్‌ను చూపించబోతున్నాడు. మాములుగా అయితే పెద్ద సినిమాలకు విడుదల రోజు ఉదయం షోలు ఉంటాయి. కానీ ‘రాజా సాబ్’ విషయంలో మేకర్స్ ఒక అడుగు ముందుకు వేశారు. జనవరి 8 రాత్రి 9 గంటలకే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో ఈ స్పెషల్ షోల కోసం టికెట్ ధరను ₹1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. ప్రభాస్‌ను ముందుగానే స్క్రీన్‌పై చూడాలనుకునే అభిమానులు ఈ రేటుకు కూడా టికెట్లు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.
ALso Read:The RajaSaab: ‘ది రాజాసాబ్’ కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..
సినిమా విడుదలైన తర్వాత సాధారణ షోల కోసం కూడా ధరలను భారీగానే ఖరారు చేశారు. నగరాల్లోని ప్రధాన మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర ₹377గా ఉంది. మాస్ ఆడియెన్స్ ఎక్కువగా ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ధర ₹297గా నిర్ణయించారు. మాములు రేట్‌కంటే భారీగానే రేట్లు పెరిగాయన్న మాట. టికెట్ ధరలు ఈ స్థాయిలో ఉన్నా ప్రభాస్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్స్, మారుతి మార్క్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ టికెట్ రేట్లకు సంబంధించిన జీవో అయితే ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఈరోజు పొద్దుబోయే లోపు లేదా రేపు ఉదయమే ఈ జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.
