ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం చుట్టూ చట్టపరమైన వివాదం చెలరేగింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) మరియు ఐవీ(ivy) ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన వివాదం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అసలు విషయం ఏమిటి అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఈ అంశం మీద ఐవీ(ivy) ఎంటర్‌టైన్‌మెంట్ కోర్టుకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ హీరోగా రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమా మొదలు పెట్టింది. ఈ సినిమాలో ఐవీ రూ. 225 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఐవీ రూ. 218 కోట్లు చెల్లించినప్పటికీ, తర్వాత ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరింది.
Also Read:Vijayawada: వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత మృతి..!
PMF దాన్ని తిరస్కరించి, ఐవీ పెట్టుబడిని మించి సినిమాలో ఖర్చు చేసినట్లు పేర్కొంది. అయినా సరే కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడమతొ PMF ఐవీపై లీగల్ నోటీసు జారీ చేయగా, ఐవీ కూడా కౌంటర్ నోటీసు ఇచ్చింది. ఈ రెండు కేసులు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. తాజా విచారణలో PMF కోర్టుకు ఒక ప్రతిపాదన సమర్పించింది: దాని ప్రకారం సినిమా రిలీజ్ కి ముందు ఐవీ పెట్టిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, అలాగే సినిమాపై ఐవీకి ఎలాంటి హక్కులు లేకుండా చూడాలని కోరింది. దీనికి ఐవీ కౌంటర్ ప్రతిపాదన సమర్పించాలని, రెండు పక్షాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా ఐవీ సమాచారాన్ని మీడియాకి లీక్ చేసింది.
