The Paradise Release: ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై అనుమానాలు.. మార్చిలో లేనట్టేనా?
- నాని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ది ప్యారడైజ్’
- ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై అనుమానాలు
- మార్చి 2026లో విడుదల కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘న్యాచురల్ స్టార్’ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 8 భాషల్లో రిలీజ్ అయ్యే ప్యారడైజ్.. అనుకున్నట్లుగా మార్చి 2026లో విడుదల కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ అవుట్ పుట్ కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వనుందని సమాచారం.
‘ది ప్యారడైస్’ సినిమాను ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందించారు. ఇది నాని కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగినట్టు సమాచారం. ఇప్పటికీ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. దర్శకుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్‌గా రావాలనే లక్ష్యంతో షూటింగ్‌ను నెమ్మదిగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. అందుకే షెడ్యూల్స్ కాస్త లేటు అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
Also Read: Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదే?
‘ది ప్యారడైస్’ కథ 1990ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని.. తమ హక్కుల కోసం పోరాడే ఒక గిరిజన తెగ జీవన పోరాటాన్ని చూపించనుంది. సామాజిక అంశాలతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వడానికి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. రిలీజ్ ఆలస్యం అయినా సరే.. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. ఇప్పటికే విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. ది ప్యారడైస్‌తో మరో లెవల్‌కు వెళ్లనున్నాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రిలీజ్ ఎప్పుడైనా సరే.. ఈ సినిమా నాని కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!