Site icon NTV Telugu

Horror Thriller: ఆకట్టుకుంటున్న ‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్ పోస్టర్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు తమ చిత్రాల పోస్టర్స్ ద్వారా పలువురు దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆ వరుసలోనే నిలిచింది ‘ది మాన్షన్ హౌస్’ చిత్ర బృందం. తలారి వీరాంజనేయ సమర్పణలో బీసీవీ సత్య రాఘవేంద్ర ‘ది మాన్షన్ హౌస్’ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ మెహర్, యశ్‌, వృందా కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ కార్తిక్ దర్శకత్వం వహించే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్ ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. పెద్ద బంగ్లా, దాని కారిడార్ లో నిలుచున్న ఓ మహిళ, దూరంగా కొండ మీద ఊళ పెడుతున్న నక్క, ఆకాశం నుండి కిందపడుతున్న మనుషులు… బంగ్లా ముందు షెర్లాక్ హోమ్స్ ను తలపించే ఓ డిటెక్టివ్… ఈ పోస్టర్ ను చూస్తుంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఈ మూవీ ఉండబోతోందని పిస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు హేమంత్ కార్తీక్, సత్య రాఘవేంద్ర చెబుతున్నారు.

Exit mobile version