Site icon NTV Telugu

The Luck : “ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో!

The Laky

The Laky

దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం ప్రకారం, ఇక్కడ ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు. కేవలం స్థైర్యం, వ్యూహం, ఓర్పు, అలాగే కొంచెం అదృష్టం ఉంటే చాలు. ఎవరికైనా ఈ గేమ్‌లో పాల్గొని, విజేతగా నిలిచి, రూ.10 లక్షల రూపాయల నగదు బహుమతి గెలిచే అవకాశం ఉంది.

Also Read  : Jackie Shroff : ముద్దు సీన్లు చేయాలంటే.. పెగ్గు పడాల్సిందే

ఈ గేమ్ షో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ ఉండదు. పూర్తిగా ఉచితంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. విశ్వసనీయ సబ్‌స్క్రైబర్లలోంచి యాదృచ్ఛికంగా పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేస్తారు. గెలిచిన వారికి పెద్ద బహుమతి ఉండగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు, ఈ షో యూట్యూబ్‌తో పాటు ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. షోను ఒక ప్రముఖ సెలబ్రిటీ హోస్ట్ చేయబోతున్నారని బృందం వెల్లడించింది. “ది లక్” గురించి చెప్పుకుంటే, ఇది కేవలం ఒక వినోదాత్మక గేమ్ షో మాత్రమే కాదు. ఇది సాధారణ వ్యక్తికి తన పట్టుదల, సహనం, అదృష్టాన్ని పరీక్షించుకునే వేదిక. కీర్తి కోసం కాకుండా, తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. “ది లక్” అంటే అందరికీ అవకాశం, అందరికీ గెలుపు ఛాన్స్ అని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వల్ల ఇప్పటికే యువతలో ఆసక్తి పెరిగింది.

తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమక్షంలో ఈ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్, క్రియేటివ్ డైరెక్టర్స్ శ్రేయాస్ సిఎం, సూర్య తోరమ్స్, అపురూప, లీగల్ అడ్వైజర్ సాయి చాతుర్య అరవ, నిర్వాహకులు మహర్షి నీల & హరిప్రియ మొదలవలస, డి.ఓ.పి భాను తేజ, లైన్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ బాల వంటి టీమ్ సభ్యులు పాల్గొన్నారు. షో కాన్సెప్ట్, నియమ నిబంధనలు, బహుమతులు, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని బృందం తెలిపింది.

మీరు కూడా ఈ గేమ్ షోలో పాల్గొనాలనుకుంటే వెంటనే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వండి( www.theluck.world)

Exit mobile version