Site icon NTV Telugu

Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?

Prakash-Raj

Prakash Raj తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సౌత్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేరిపోయాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా “ది కాశ్మీర్ ఫైల్స్”పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Read Also : Vidya Balan: ఆ నిర్మాత చేసిన దారుణానికి.. ఆరునెలలు నేను ఆ పని చేయలేదు

“#కాశ్మీర్ ఫైల్స్… ఈ ప్రచార చిత్రం గాయాలను నయం చేస్తుందా ? రేపుతోందా? లేదా ద్వేషం విత్తనాలను నాటుతుందా?” అని ప్రశ్నిస్తూ ఎప్పటిలాగే తనదైన శైలిలో #జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక The Kashmir Files కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version