Site icon NTV Telugu

Kangana Ranuth: ప్రైవసీ కోరిన హీరోయిన్.. కోర్టు నుంచి అందరిని పంపించేసిన జడ్జి

Kangana

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉన్నా ఆమె వెతుక్కుంటూ వెళ్లి మరీ వివాదాలను కొనితెచ్చుకొంటది. రెండేళ్ల క్రితం బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ పై కంగనా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందనిజావేద్ అక్తర్ కంగనాపై పరువు నష్టం దావా కూడా వేసిన విషయం విదితమే.. ఇక తాజాగా ఈ కేసు విచారణకోసం కంగనా అంధేరిలోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు మెట్లెక్కింది. ఆ సమయంలోనే కంగనా జడ్జికి ఒక పర్సనల్ విన్నపం కూడా చేసింది. తనకు కోర్టులో ప్రైవసీ కావాలని న్యాయమూర్తిని అడగగా.. ఆయన వెంటనే కోర్టులో ఉన్న లాయర్లను, మీడియాను బయటికి పంపించేశారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం విన్నవారికి కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోయిన్ ప్రైవసీ కావాలని అడిగితే మీడియాను, మిగతా లాయర్లను బయటికి పంపించేయాడమేంటి విడ్డూరం కాకపోతే అని కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. అది న్యాయస్థానంలో ఉన్న ఒక రూల్ అని, సెలబ్రెటీలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా విచారం జరిగే సమయంలో ప్రైవసీ కావాలనుకొనేవారికి న్యాయస్థానం ప్రైవసీని కలుగజేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కేసుపై న్యాయస్థానం తీర్పు త్వరలోనే ఇవ్వనుంది.

Exit mobile version