K. Raghavendra Rao: టాలీవుడ్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ ఇప్పటికే కోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట పరిధిలో ఈ రెండెకరాల భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు జారీచేసింది. రాఘవేంద్రరావుతో పాటు కె. కృష్ణమోహన్ కు కూడా నోటీసులు పంపారు. అసలు విషయానికొస్తే..తెలుగు చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గతంలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల భూమిని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు అన్నది ఆరోపణ. ఆ భూమిలో పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు దర్శకేంద్రుడు వాడుతున్నాడని సమాచారం. అది నచ్చని బాలకిషన్ ఆ విషయంపై కోర్టుకు వెళ్ళాడు.
Satyabhama Teaser: కాజల్ నట విశ్వరూపం.. దుమ్మురేపింది
2012లో బాలకిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ భూమిలో పబ్‌లు, థియేటర్లు కట్టి సొమ్ము చేసుకుంటున్నాడని పిల్ లో పొందుపరిచాడు. ఇక గతేడాది కూడా నోటీసులు పంపగా .. అవి అందలేదని మరోసారి వారికి నోటీసులు పంపిన్నట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులను ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. మరి దీని గురించి రాఘవేంద్రరావు ఎలా స్పందిస్తాడో చూడాలి.