NTV Telugu Site icon

“మా” సభ్యుల ఆరోగ్యమే ముఖ్యం:విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఆదివారం ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ .. ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్‌ క్యాంపులను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలను చేపట్టినట్టు వెల్లడించారు. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్‌లను చేయిస్తున్నామన్నారు.

మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారని విష్ణు తెలిపారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ కోసం ముందుకు వచ్చి అన్ని రకాల టెస్టులు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్‌లకు కూడా ఈ హెల్త్‌ చెకప్‌లు చేయిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్టు విష్ణు తెలిపారు.

వారం రోజుల్లో ప్రకటన…
మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ‘మా’ కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం. ఇప్పటికే దీనిపై పెద్దలతో సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు. త్వరలోనే మా భవనం అంశంపై స్పష్టతను ఇస్తామని విష్ణు వెల్లడించారు. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌, నాగబాబుల మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విష్ణు వారి రాజీనామాలను ఆమోదించలేదు.