The Great Indian Suicide: మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా హెబ్బా పటేల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేష్, తమిళ నటుడు జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించిన యూనిట్ అనేక విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు, నరేష్ తక్కువ సీన్స్ చేసినా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, ఈ సినిమాలో పవిత్ర లోకేష్ క్యారెక్టర్ చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుందని అన్నారు.
The Vaccine War: “ది వాక్సిన్ వార్” సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
నన్ను నమ్మండి ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఈ సినిమాతో మీరొక సరికొత్త హెబ్బాను చూస్తారని అన్నారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ రెండు రోజుల్లో ఈ సినిమా ఆహా లో స్ట్రీమ్ అవుతుందని, ఖచ్చితంగా సినిమాను చూడండని అన్నారు. ఇక ఈ సినిమాకి విప్లవ్ కోనేటి స్క్రీన్‌ప్లే- రచన, నిర్మాత & దర్శకత్వం ఇలా అన్ని విభాగాలు తానై చూసుకున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని టీమ్ చెబుతోంది. ఇక కొన్నేళ్ల క్రితం ఢిల్లీ బురారీ సూసైడ్, మదనపల్లె అక్కాచెల్లెళ్ల మిస్టరీ మృతి వంటి వాటిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.