Site icon NTV Telugu

Taraka Rama : ఆకట్టుకున్న అనగనగా ఆస్ట్రేలియాలో ట్రైలర్

Anganaga

Anganaga

సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

దర్శకుడు తారక రామ మాట్లాడుతూ ‘ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో చేసాం. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రం తెలుగు వారే. తెలుగు వాడు అయిన తాను ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యాను. చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టంతో జాబ్ చేసుకుంటూనే ఫిల్మ్ కోర్స్ లో మాస్టర్స్ చేశాను. సినిమాపై ఉన్న ఇష్టమే తనను ఈ సినిమా తీసేలా చేసింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వాతావరణం చాలా వింతగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో సినిమా చేయడం చాలా కష్టమైనప్పటికీ ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉంది. మొత్తం షూటింగ్ 122 రోజుల్లో 83 లోకేషన్స్ లో పూర్తి చేశాను. చాలా మంది స్క్రిప్ట్ చదవి ఈ చిత్రం ఇక్కడ చేయడం కష్టమన్నారు. అయినా పట్టువిడువకుండా పూర్తి చేసాము. ప్రేక్షకులందరు ఆశీర్వదించండి’ అని అన్నారు.  ఇక అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ ట్రైలర్ చూస్తే చాలా రోజుల తరువాత మంచి థ్రిల్లర్ ను చూడబోతున్నట్లు అర్థం అవుతుంది. హాలీవుడ్ గడ్డపై తీయడమే కాదు హాలీవుడ్ మేకింగ్ కనిపిస్తుంది. యదార్థసంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మనదగ్గర ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు ఒక ఆలోచన ఉంటుంది కానీ విదేశాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతాయో తెలియాలంటే మార్చి 21 వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version