Site icon NTV Telugu

The Goat Life Trailer: మలయాళ స్టార్ హీరో మరో ప్రయోగం.. ఏం ఉందిరా మావా ట్రైలర్

Goat

Goat

The Goat Life Trailer: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా కానీ, పృథ్వీరాజ్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఈ మధ్యనే సలార్ లో వరద రాజమన్నార్ గా అతడి యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తరువాత అతను నటించిన తాజా చిత్రం ది గోట్ లైఫ్.. ఆడు జీవితం. సర్వైవర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సరసన అమలాపాల్ నటిస్తుంది. బ్లెస్సీ ఈ సినిమాకు దర్శకత్వం ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా మార్చి 28 న రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్.. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది కథగా తెలుస్తోంది. ఎడారిలో విజువల్స్ అదిరిపోయాయి. ఏఆర్ రెహమన్ సంగీతం కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. మరి ఈ సినిమాతో పృథ్వీరాజ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version