Site icon NTV Telugu

The Girlfriend : నా హాస్టల్ మెమరీ నుంచి.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్టోరీ పుట్టింది: రాహుల్ రవీంద్రన్

The Girl Friend

The Girl Friend

హీరో-డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తాజాగా తన కొత్త రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ని తెరకెక్కించారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 7, 2025 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్, తర్వాత దర్శకుడిగా చిలసౌ సినిమాతో డెబ్యూ ఇచ్చి మంచి హిట్ అందుకున్నారు. అయితే, నాగార్జునతో చేసిన మన్మథుడు 2 డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన దర్శకుడిగా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Also Read : Shruti Haasan: ‘నిజం మాట్లాడితే వేలెత్తి చూపేవాళ్లు ఎక్కువ’ – శ్రుతి హాసన్

ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ రొమాంటిక్, ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందించబడింది. అక్టోబర్ 25న విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆసక్తికరంగా ఆకట్టుకుంది. ఇందులో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ‘నేను స్టూడెంట్‌గా హాస్టల్‌లో ఉండగా ఈ కథ ఐడియా వచ్చింది. కొన్నేళ్ల క్రితం దీన్ని స్టోరీగా రాసుకున్నా. ట్రైలర్‌లో మీరు చూసినదే సినిమా. ఇది ఇంటెన్స్ ఎమోషన్‌తో ఉంటుంది. రిలేషన్‌షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సినిమా చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. మూవీ రియల్, రూటెడ్, ఇంటెన్స్, ఎమోషనల్‌గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక తమ పర్‌ఫార్మెన్స్‌తో కథకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టం. మానిటర్ వెనక కూర్చుని వీళ్ల పర్‌ఫార్మెన్స్ ఆస్వాదించాను. నేను ఫస్ట్ ఆడియన్స్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేను ఒక రోల్ చేశాను. ఇలాంటి మూవీస్‌కు ప్రేక్షకుల సపోర్ట్ అవసరం’ అని తెలిపారు.

Exit mobile version