Site icon NTV Telugu

Committee Kurrollu: నిహారిక కమిటీ కుర్రోళ్ళు సందడి సందడి చేస్తున్నారు

Maxresdefault

Maxresdefault

Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి జాతర పాట “సందడి సందడి” అనే సాంగ్ ను చిత్రబృందం టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ పాటను సింహాచలం మన్నెల రచించగా.. అనుదీప్ దేవ్, రేణూ కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి ఆలపించారు.

Also Read: Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ

జాతర నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. అలానే ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, జాతర సన్నివేశాలు, కుర్రాళ్ల ధూంధాం స్టెప్పులు బాగున్నాయి. ఇకనుంచి ప్రతి జాతరలో ఇదే పాట వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో నిహారిక నిర్మాతగా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక తదితరులు నటించారు.

Exit mobile version