The Family Star Shoot Pending: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని ప్రకటించారు కానీ, సంక్రాంతి నుంచి వాయిదా పడింది. గీతగోవిందం మూవీ తర్వాత విజయ్ – పరశురామ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై గతంలో దిల్ రాజు క్లారిటీ కూడా ఇచ్చాడు. దేవర సినిమా కనుక ఏప్రిల్ 5 నుంచి వాయిదా వేస్తే అప్పుడు ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కి రిలీజ్ చేస్తామనిఅన్నాడు.
Mangalavaram : అదిరిపోయే టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న మంగళవారం..
దేవర వాయిదాతో అనుకున్నట్లుగానే ఆ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడని మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి ఈ సినిమా రావడం డౌటే అంటున్నారు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకి ఇంకా 15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. అది పూర్తి కాక మునుపు పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టలేరు. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పటికప్పుడు షూట్ చేసే పరిస్థితులు కూడా లేవని అంటున్నారు. సంక్రాంతికి షూటింగ్ పూర్తికాకపోవడంతో ది ఫ్యామిలీ స్టార్ వాయిదా పడింది. దేవర డేట్ మరెవరూ తీసుకోకుండా ఇప్పుడు కర్చీఫ్ వేశారు. కానీ ఆ సినిమాను ఆ రోజుకి దింపడం కష్టం అని టాక్ అయితే వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
