Site icon NTV Telugu

ఏకమ్’ దర్శకుడు వరుణ్ వంశీకి ద్వితీయ అవకాశం!

అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఏకమ్‌’. గత యేడాది అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని వరుణ్‌ వంశీ దర్శకత్వంలో ఎ. కళ్యాణ్‌ శాస్త్రి, పూజ ఎం, శ్రీరామ్ కె సంయుక్తంగా నిర్మించారు. పంచ భూతాల నేపథ్యంలో తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ‘ఏకమ్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే.. ప్రస్తుతం ఈ సినిమా కేవలం పదిరోజులలో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.

ఈ విషయాన్ని దర్శకుడు వరుణ్‌ వంశీ తెలియచేస్తూ, ”నా మొదటి చిత్రం ‘ఏకమ్’ను నిర్మాతల పెట్టుబడి వెనక్కి వచ్చేలా పరిమితమైన బడ్జెట్ లో తెరకెక్కించాను. దాని ఫలితాలను వారు పొందుతున్నారు. దాంతో నాకు మరో సినిమా రూపొందించే అవకాశం లభించింది. రాబోయే రోజుల్లో ‘ఏకమ్‌’ టాప్ ఫైవ్‌ లోకి వస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ సినిమా రూపకల్పనకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వరుణ్‌ వంశీ ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version