Site icon NTV Telugu

RT75: కుర్రోళ్ళు రెడీ అయిపోండ్రి… రవన్న దావత్ పార్టీలో చిందులేస్తున్న స్టార్ హీరోయిన్

Sll

Sll

Ravi Teja and Sreela’s Next Movie RT75: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇటీవలే సామజవరాగమనా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ చిత్రాన్ని ‘RT75’ అని ప్రకటించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read; Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!

రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ హరిశంకర్ తో “మిస్టర్ బచ్చన్ ” అనే మూవీ షూటింగ్ లో బిజీ ఉండగా తన తదుపరి సినిమా ‘RT75’ వచ్చే జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉగాదికి రిలీజ్ చేసిన పోస్టర్ ఊరి జాతరను చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.. అంతే కాకుండా ఇప్పుడు మూవీ మేకర్స్ ఒక క్రేజీ న్యూస్ రివీల్ చేసారు అది ఏమిటి అంటే ఈ సినిమా లో రవితేజ సరసన నటించబోయే హీరోయిన్ పేరుని అధికారంగా ప్రకటించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తుంది అని మేకర్స్ చెప్పుకొచ్చారు. గతంలో విల్లు ఇద్దరు కలిసి “ధమాకా”లో నటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇదే కనుక నిజం అయితే వచ్చే సంక్రాంతి పండక్కి రవి అన్న దావత్ కి శ్రీలీల అధిరిపోయే స్టెప్పులుకి ఫాన్స్ రెడీ అయ్యిపోవాలిసిందే.

Exit mobile version