Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ తెలుగులో ‘జన నాయకుడుగా రిలీజ్ కాబోతుంది. మరో రెండు రోజుల్లోఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. పాపులర్ సింగిల్ స్క్రీన్స్ అన్నిటిని జననాయగన్ కోసం లాక్ చేసారు. తెలుగులో ఈ సినిమాను SVC బ్యానర్ పై దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. విజయ్‌కి తెలుగునాట ఏ స్థాయి క్రేజ్ ఉందో నిరూపిస్తూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఉదయం 8 గంటల నుంచే షోలు షెడ్యూల్ చేసారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ నెట్వర్క్ థియేటర్లలో విపరీతంగా షోలను కేటాయించారు. రోజుకి 15 నుండి 20 షోలు వేస్తూ విచ్చలవిడిగా పరిచేసారు. గురువారం విడుదల అంటే సోమవారమే బుకింగ్ లు తెరిచేసారు. విజయ్ కు తెలుగునాట గట్టిగా క్రేజ్ వుందని నమ్ముతున్నట్లున్నారు సదరు డిస్ట్రిబ్యూటర్. కేవలం నైజాం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లోనూ ‘జన నాయగన్’ థియేటర్ల కౌంట్, షోల సంఖ్య భారీగా ఉంది. డబ్బింగ్ సినిమాలకు సైతం ఈ స్థాయిలో థియేటర్లు కేటాయించడం కాస్త ఆశ్చర్యమే. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశించినంత లేవు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి అఫీషియల్ రీమేక్ గా వస్తుంది జననాయగన్.
Also Read
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
తాజావార్తలు
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!