నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు బర్త్ డే కానుక గా ఈ సినిమా కు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే కానుక గా భగవంత్ కేసరి టీజర్ కూడా అనిల్ రావిపూడి విడుదల చేయడం తో భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మరో భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.
అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై భారీ గా అంచనాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యం లో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమా ఓటిటీ హక్కుల గురించి ఒక వార్త వినిపిస్తుంది. ఓటిటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం.అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్ కేసరి ఓటిటీ హక్కు ల ను సొంతం చేసుకుందని తెలుస్తుంది… దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.. ఇక ఈ సినిమాలో బాలయ్య కు జోడీ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.బాలయ్య కూతురు పాత్ర లో శ్రీలీల నటిస్తుంది.అలాగే ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ స్టార్ అయిన అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమా ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా దసరా కానుక గా విడుదల కాబోతున్న నేపథ్యం లో స్పీడ్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. మరి అనిల్ రావిపూడి బాలయ్య కు భారీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.