Tharun Bhascker, Eesha Rebba Jaya Jaya hey Remake Announced: ఇప్పటికే పలు చిత్రాల్లో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆయన మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన జయ జయ జయహే సినిమా రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది.
Lingusamy: దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు .. లింగుసామి కంపెనీ కీలక వ్యాఖ్యలు
ఈ రోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్ విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా చీర ధరించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు . అయితే సినిమా అనౌన్స్ చేశారు కానీ ఇది మలయాళ రీమేక్ సినిమా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బహుశా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.